English | Telugu

వంద కోట్ల క్వీన్ సోనాక్షి సిన్హా

బాలీవుడ్ సినీపరిశ్రమలో ఇప్పుడు సినిమా సక్సెస్ నిర్వచనం మారిందనే చెప్పాలి. వంద కోట్ల బిజినెస్ చేస్తేగాని ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించిందని అనుకోవటంలేదు బాలీవుడ్ వర్గాలు. వంద కోట్ల బిజినెస్ చేసిన హీరోల కంటే ఆ సినిమాలలో నటించిన హీరోయిన్‌లకు ఎక్కువ ప్రాముఖ్యత లభిస్తోంది. గత ఏడాది ఎక్కువ కలెక్షన్లతో బాలీవుడ్ బాక్సాఫిస్ క్వీన్ గా నిలిచింది దీపికా పదుకోన్. ఈ సారి ఆ స్థానాన్ని సోనాక్షి సొంతం చేసుకునేపనిలో వున్నట్టు కనిపిస్తోంది. లేటెస్టుగా 100 కోట్ల బిజినెస్ చేసిన ఐదు సినిమాలు ఈ ముద్దుగుమ్మ అకౌంట్‌లోకి చేరాయి.


సోనాక్షి సిన్హా, అక్షయ్ కుమార్‌తో కలిసి నటించిన హాలిడే చిత్రం తాజాగా వంద కోట్ల బిజినెస్ హౌస్‌లో చేరింది. విడుదలైన 15 రోజులకే ఈ చిత్రం వంద కోట్ల కలెక్షన్లు రాబట్టుకుంది. కరీనా, దీపిక, కత్రీనా, ప్రియాంక, అసిన్ ల ఖాతాల్లో వంద కోట్ల బిజినెస్ చేసిన నాలుగు నాలుగు సినిమాలున్నాయి. హాలిడే చిత్రం తాజాగా రాబట్టుకున్న కలెక్షన్లతో సోనాక్షి కొత్త రికార్డు సాధించింది. నూరు కోట్ల రూపాయల బిజినెస్ చేసిన అత్యధిక చిత్రాలు సోనాక్షి ఖాతాలోచేరినట్లయింది. కలెక్షన్లు, రికార్డులు కలిసివస్తున్న సోనాక్షికి ఈపాటికేలీవుడ్‌ నిర్మాతలు రెడ్ కార్పెట్ పరిచేసి వుంటారు.


టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .