English | Telugu

2018.. 8 రోజుల్లో 8 కోట్లు! కానీ...

మలయాళంలో లేటెస్ట్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన '2018' మూవీ తెలుగు ప్రేక్షకుల్నీ ఆకట్టుకుంటోంది. 2018లో ప్రజా జీవితాన్ని కకావికలం చేసిన కేరళ వరదల నేపథ్యంలో దర్శకుడు జ్యూడ్ ఆంథోనీ జోసెఫ్ రూపొందించిన ఆ సినిమా మలయాళ ఇండస్ట్రీకి కొత్త ఊపిరిలూదింది. అక్కడి ఎగ్జిబిషన్ సెక్టార్‌కు ప్రాణం పోసింది. టొవినో థామస్, కుంచకో బోబన్, ఇంద్రన్స్, అపర్ణా బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, అసిఫ్ అలీ, లాల్, నరైన్, అజు వర్ఘీస్, సిద్దిఖ్ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు.

ఇటీవల ఈ సినిమా తెలుగులో విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. 8 రోజుల్లో 8.21 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఒక మలయాళం డబ్బింగ్ సినిమాకు ఈ కలెక్షన్లు రావడం పెద్ద విషయమే. 'ఎవెరీవన్ ఈజ్ ఎ హీరో' అనే టాగ్‌లైన్‌తో ఈ మూవీని బన్నీ వాస్ రిలీజ్ చేశారు.

కాగా తెలుగులో బాగా ఆడుతున్న సందర్భంలోనే ఈ సినిమా అన్ని భాషల్లో ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ సోనీ లివ్‌లో విడుదలవుతుండటం గమనార్హం. ఇది థియేటర్లలో ఆడుతున్న తెలుగు వెర్షన్ కలెక్షన్లపై ప్రతికూల ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 167 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.