English | Telugu
మహేష్ 1కు ఇదే చివరి నెల అవుతుందా..?
Updated : Jan 23, 2014
మహేష్ నటించిన "1" చిత్రం విడుదలై 13 రోజులు గడిచినప్పటికీ, ఇప్పటికి కూడా మొత్తం 30 కోట్లకు మించి కలెక్షన్లు రాబట్టలేకపోయింది. సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో కలెక్షన్లు మొత్తం తగ్గిపోయాయి. ట్రేడ్ అనలిస్ట్ ల అంచనాల ప్రకారం ఈనెల చివర వరకు మాత్రమే ప్రదర్శించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఎందుకంటే ఈ నెల చివర్లో పూరి "హార్ట్ ఎటాక్", "పాండవులు పాండవులు తుమ్మెదా" వంటి చిత్రాలు విడుదలవుతున్నాయి. కాబట్టి "1" చిత్రం మరికొద్ది రోజుల్లోనే థియేటర్ల నుండి కనుమరుగయ్యేట్లుగా కనిపిస్తుంది.