English | Telugu

చెర్రీ గోవిందుడు రూమర్స్ మాత్రమే

కృష్ణవంశీ దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కనున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాకు "గోవిందుడు అందరి వాడేలే" అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా గతకొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై దర్శక,నిర్మాతలు స్పందిస్తూ... "ఈ సినిమాకు ఇంకా టైటిల్ ను నిర్ణయించలేదు. మీరు రూమర్స్ ను నమ్మకండి. ఏ విషయమైన స్వయంగా మేమే ప్రకటిస్తాం" అని అన్నారు. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఫిబ్రవరి 6న ప్రారంభం కానుంది. ఈనెల 26 నుంచి హైదరాబాద్ లోని రామానాయుడు సినీవిలేజ్ లో సెట్ వర్క్ కూడా మొదలు పెట్టనున్నారు. ఇందులో చరణ్ అన్న పాత్రలో నటుడు శ్రీకాంత్, వదిన పాత్రలో హీరోయిన్ కమలినీ ముఖర్జీ నటించబోతున్నారు.చరణ్ సరసన కాజల్ అగర్వాల్ జతకట్టనుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.