English | Telugu
ఎన్టీఆర్ నా సినిమాకి ట్వీట్ చెయ్యడు..కారణం ఇదే అంటున్న కళ్యాణ్ రామ్!
Updated : Dec 27, 2023
మొన్నీ ఈ మధ్య నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న డెవిల్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్ కి ఎన్టీఆర్ హాజరవ్వకపోడం గురించి చాలా మంది మాట్లాడుకున్నారు. పైగా ఎన్టీఆర్ తన ట్విటర్ లో కూడా డెవిల్ గురించి ఎక్కడ మాట్లాడలేదు. దాంతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ల మధ్య మనస్పర్థలు వచ్చాయనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు అలాంటి రూమర్స్ కి కళ్యాణ్ రామ్ చెక్ పెట్టాడు.
కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతు తమ్ముడు ఎన్టీఆర్ నేను మా పరిధిలో మేము ఉండాలని ఒక గీత గీసుకున్నాం. ఆ గీత ప్రకారమే ఇద్దరం నడుచుకుంటుంటాం అంతే కానీ మేము అన్నదమ్ములమని ప్రతి ఒక్కరికి తెలియాలని ఒకరినొకరు చనువు తీసుకునే అవసరం కూడా మాకు లేదు. అలా అని మా ఇద్దరి మధ్య ప్రేమలేదని కాదు కాకపోతే ఎవరి కోసమో క్లోజ్ గా ఉండలేం. మా పరిధిలో మేము ఉంటు చాలా ఆనందంగా ఉంటాం. అలాగే లైఫ్ లాంగ్ మా అన్నదమ్ముల అనుబంధం కొనసాగుతుందని కూడా చెప్పాడు.
అలాగే ఎన్టీఆర్ తన సినిమాల గురించి ట్వీట్ చెయ్యడం గాని తన సినిమా ఫంక్షన్స్ కి రాకపోవడం గురించి కూడా కళ్యాణ్ రామ్ సమాధానం చెప్పాడు.తమ్ముడు కి నాకు మధ్య ఉన్న అనుబంధం మా ఇద్దరికీ మాత్రమే తెలుసు. అంతే గాని ట్విటర్ లో నా సినిమా గురించి ప్రస్తావిస్తేనో నా సినిమా ఫంక్షన్స్ కి వచ్చి మాట్లడితేనో మా మధ్య అనుబంధం ఉన్నట్టు కాదు. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ నా ఒక్కడిదే కాదు తమ్ముడిది కూడా. తన బ్యానర్ లో తమ్ముడు సినిమా చేస్తున్నప్పుడు అంతా తమ్ముడే చూసుకుంటాడు అని కూడా కళ్యాణ్ రామ్ చెప్పాడు.
అలాగే తారక్ డెవిల్ ట్రైలర్ చూసాడు. చాలా బాగుందని మెచ్చుకోవడమే కాకుండా ట్రైలర్ లో కొన్ని మార్పులు కూడా చెప్తే దాని ప్రకారమే రెడీ చేసి రిలీజ్ చేసాం. తమ్ముడు రేంజ్ ఏంటో అందరకి తెలుసు. ఆయనేమి చిన్నపిల్లాడు కాదు అని కూడా కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ చెప్పిన ఈ మాటలతో ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ల మధ్య ఉన్న అన్నదమ్ముల అనుబంధం చాలా క్లియర్ గా ఉందనే విషయం అందరికి అర్ధమయినట్టయింది. అలాగే విమర్శకుల నోటికి తాళం కూడా పడినట్టయ్యింది.