English | Telugu

చిరుకి కథ చెప్పిన చిన్ని కృష్ణ

చిరుకి కథ చెప్పిన చిన్ని కృష్ణ అని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే "నరసింహనాయుడు, ఇంద్ర, గంగోత్రి, బద్రీనాథ్" వంటి చిత్రాలకు కథలనందించిన చిన్ని కృష్ణ జనవరి ఒకటవ తేదీ, తన జన్మదినోత్సవం నాడు పద్మభూషణ్, మెగాస్టార్, డాక్టర్ చిరంజీవికి ఒక కథను చెప్పారట. ఆ కథ ప్రస్తుత పరిస్థితులను ఆసరాగా చేసుకొని రాజకీయాలపై సాగే కథని సమాచారం.

ఇలాంటి కథ చిరంజీవి రాజకీయ జీవితానికి బాగా ఉపయోగపడుతుందని కూడా అంటున్నారు. అయితే చిరంజీవి 150 వ సినిమా ఉంటుందని కాసేపూ, ఆయన ఇక సినిమాల్లో నటించడని కాసేపూ వినపడుతూ ప్రేక్షకులను అయోమయంలో పడేసింది.

ప్రస్తుతం చిన్ని కృష్ణ చెప్పిన కథను మెగాస్టార్ విన్నాడంటే మరి అది తన కోసమా లేక తన కొడుకు రామ్ చరణ్ కోసమా అన్నది ఇంకా తెలియలేదు. ఈ కథ రాజకీయాలకు సంబంధించింది కాబట్టి మెగాస్టార్ కోసమే అంటున్నారు ఫిలిం నగర్ వాసులు.ఏది ఏమైనా పుట్టినరోజునాడు మెగాస్టార్ వంటి నటుడికి కథ చెప్పటం చిన్ని కృష్ణకు ఒక అదృష్టంగా భావించవచ్చు.