English | Telugu

ఆ స్టార్ తోనే అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే..?

అనిల్ రావిపూడి(Anil Ravipudi)కి సంక్రాంతి డైరెక్టర్ గా పేరు పడిపోయింది. అనిల్ డైరెక్ట్ చేసిన 'ఎఫ్-2', 'సరిలేరు నీకెవ్వరు', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు సంక్రాంతి సీజన్ లో విడుదలై సక్సెస్ సాధించాయి. ముఖ్యంగా గతేడాది సంక్రాంతికి విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం' బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సంక్రాంతికి వచ్చిన 'మన శంకర వరప్రసాద్ గారు' అంతకుమించిన హిట్ దిశగా దూసుకుపోతోంది. (Mana Shankara Vara Prasad Garu)

ఇప్పటిదాకా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తొమ్మిది సినిమాలు వస్తే.. అందులో నాలుగు సినిమాలు సంక్రాంతికి వచ్చి విజయం సాధించినవే. వచ్చే సంక్రాంతికి కూడా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రావిపూడి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

'సంక్రాంతికి వస్తున్నాం', 'మన శంకర వరప్రసాద్ గారు' వంటి వరుస భారీ విజయాల తర్వాత అనిల్ రావిపూడి తదుపరి సినిమా ఎవరితోననే ఆసక్తి నెలకొంది. అయితే రావిపూడి మరోసారి వెంకటేష్ తో చేతులు కలపబోతున్నట్లు సమాచారం. 'ఎఫ్-2', 'ఎఫ్-3', 'సంక్రాంతికి వస్తున్నాం' తర్వాత వెంకటేష్-అనిల్ కాంబోలో వస్తున్న నాలుగో సినిమా ఇది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయట.

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47' అనే సినిమా చేస్తున్నారు వెంకటేష్. ఇది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత వెంకటేష్ చేయబోయే సినిమా రావిపూడితోనే అని సన్నిహిత వర్గాల్లో వినిపిస్తున్న మాట. జూన్ లో సినిమాను స్టార్ట్ చేసి, 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నారట. మరి ఇది 'సంక్రాంతికి వస్తున్నాం'కి సీక్వెలా? లేక కొత్త కథనా? అనేది తెలియాల్సి ఉంది.

Also Read: 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ రివ్యూ