English | Telugu
అక్కినేని హీరోల మల్టీస్టారర్.. మరో 'మనం' అవుతుందా?
Updated : Jan 29, 2026
అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో మల్టీస్టారర్
భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్
ఈ తరంలో క్లాసిక్ మల్టీస్టారర్ అంటే మొదటగా గుర్తుకొచ్చే సినిమా 'మనం'. అక్కినేని హీరోలంతా కలిసి నటించిన ఈ మూవీ.. 2014 లో విడుదలై ఘన విజయం సాధించింది. ఆ తర్వాత తండ్రీకొడుకులు నాగార్జున (Nagarjuna), నాగ చైతన్య కలిసి నటించిన 'బంగార్రాజు'(2022) కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో మల్టీస్టారర్ రాబోతున్నట్లు తెలుస్తోంది.
అక్కినేని బ్రదర్స్ నాగ చైతన్య (Naga Chaitanya), అఖిల్ (Akhil Akkineni) కలిసి ఒక మల్టీస్టారర్ చేయబోతున్నట్లు సమాచారం. టాలీవుడ్ కి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా దీనిని నిర్మించనుందట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని చెబుతున్నారు.
నాగ చైతన్య ప్రస్తుతం 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో 'వృషకర్మ'(Vrushakarma) సినిమా చేస్తున్నాడు. దీనిని వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక అఖిల్ విషయానికొస్తే 'వినరో భాగ్యము విష్ణుకథ' ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్ లో 'లెనిన్'(Lenin) మూవీ చేస్తున్నాడు. ఇది మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాల తర్వాత అక్కినేని బ్రదర్స్ మల్టీస్టారర్ పట్టాలెక్కే అవకాశముంది.
Also Read: సినిమాలకు బ్రేక్ ఇస్తున్న రామ్ చరణ్!