English | Telugu
Ram Charan: సినిమాలకు బ్రేక్ ఇస్తున్న రామ్ చరణ్!
Updated : Jan 29, 2026
రామ్ చరణ్ బ్రేక్ తీసుకుంటున్నాడా?
అందుకే పెద్ది వాయిదా పడిందా?
చరణ్ బ్రేక్ కి కారణమేంటి?
టాలీవుడ్ టాప్ స్టార్స్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఒకరు. 'ఆర్ఆర్ఆర్'తో పాన్ ఇండియా స్టార్ గానూ అవతరించాడు. అలాంటి రామ్ చరణ్.. షూటింగ్ లకు చిన్న బ్రేక్ ఇవ్వనున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో 'పెద్ది'(Peddi) అనే సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. మార్చి 27న విడుదల కావాల్సిన ఈ సినిమా, మే 1 కి వాయిదా పడినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు మే నుంచి ఏకంగా సెప్టెంబర్ కి పోస్ట్ పోన్ అయినట్లు న్యూస్ వినిపిస్తోంది. దానికి కారణం రామ్ చరణ్ కొంతకాలం షూటింగ్ కి బ్రేక్ ఇవ్వడమే అని తెలుస్తోంది. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలనే ఉద్దేశంతోనే చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం.
రామ్ చరణ్, ఉపాసన దంపతులకు జూన్ 20, 2023న ఒక పాప జన్మించింది. పాప పేరు క్లీంకార. చరణ్, ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. జనవరి 31న డెలివరీ అని తెలుస్తోంది. అంతేకాదు ఈసారి ట్విన్స్ అనే న్యూస్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Also Read: టాలీవుడ్ లో వాయిదాల పర్వం.. పెద్ది, ప్యారడైజ్ బాటలో మరో క్రేజీ మూవీ!
జీవితంలో ఇలాంటి మధుర క్షణాలు మళ్ళీ మళ్ళీ రావని.. అందుకే కొన్ని వారాల పాటు షూటింగ్స్ పక్కన పెట్టి, పూర్తిగా భార్య పిల్లలతో గడపాలని రామ్ చరణ్ నిర్ణయించుకున్నాడట.
చరణ్ ఈ నిర్ణయం కొంతకాలం క్రితమే తీసుకున్నాడట. మార్చిలో 'పెద్ది' విడుదల కనుక.. జనవరి కల్లా షూటింగ్ పూర్తి చేసి, కుటుంబానికి సమయం కేటాయించాలి అనుకున్నాడట. కానీ 'పెద్ది' షూటింగ్ ఆలస్యమైంది. కనీసం 30 రోజుల షూటింగ్ పెండింగ్ ఉండనే మాట వినిపిస్తోంది.
ఫిబ్రవరి, మార్చిలో డేట్స్ కేటాయించి షూటింగ్ లో పాల్గొంటే.. మేలో 'పెద్ది'ని విడుదల చేసే అవకాశముంటుంది. కానీ, లైఫ్ లో ఇలాంటి స్పెషల్ మూమెంట్స్ మళ్ళీ రావనే ఉద్దేశంతో.. బ్రేక్ తీసుకోవాలనే నిర్ణయానికి చరణ్ వచ్చేశాడట. దీంతో 'పెద్ది' ఆలస్యం కానుందని వినికిడి. అయితే ఆలస్యంగా వచ్చినా కూడా ..'రంగస్థలం' స్థాయిలో కంటెంట్ తో సర్ ప్రైజ్ చేయడం ఖాయమంటున్నారు.