English | Telugu

పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం "సరదా"

పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం "సరదా" అని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే సంఘమిత్ర ఆర్ట్స్ పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా "పంజా" అనే చిత్రాన్ని నిర్మించిన నీలిమ తిరుమలశెట్టి, నగేష్ ముంతలకు పవన్ కళ్యాణ్ మరో చిత్రాన్ని నిర్మించే అవకాశాన్నిచ్చారట పవర్ స్టార్. కారణం "పంజా" చిత్రం ఫ్లాప్ కావడటమేనంటున్నారు ఫిలిం నగర్ వాసులు. అయితే ప్రస్తుతం లేటెస్ట్ బజ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ హీరోగా, స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభం కానుందని విశ్వసనీయవర్గాలద్వారా అందిన సమాచారం.

ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ అని కూడా తెలిసింది. ఈ సినిమాకి "సరదా" అన్న పేరుని నిర్ణయించనున్నట్టు కూడా అంటున్నారు ఫిలిం నగర్ వాసులు. ఈ "సరదా" అనే చిత్రాన్ని నీలిమ తిరుమలశెట్టి, నగేష్ ముంత నిర్మించనున్నారట.