English | Telugu
ప్రిన్స్ "బిజినెస్ మ్యాన్"లో ఆలీ పేరడీ
Updated : Jan 3, 2012
ప్రిన్స్ "బిజినెస్ మ్యాన్"లో ఆలీ పేరడీ అని అంటున్నారు ఫిలిం నగర్ వాసులు...! వివరాల్లోకి వెళితే ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, డాక్టర్ వెంకట్ నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం"బిజినెస్ మ్యాన్". ఈ "బిజినెస్ మ్యాన్" చిత్రానికి తమన్ సంగీతాన్నందించారు. ఈ "బిజినెస్ మ్యాన్" చిత్రం చాలా సీరియస్ గా ఉందని, దీన్లో ఆరేడు కామెడీ సీన్లు ప్రత్యేకంగా రాశారట దర్శకుడు పూరీ జగన్నాథ్.
వాటిలో హీరో మహేష్ బాబుతో పాటు ప్రముఖ హాస్యనటులు ఆలీకి సంబంధించిన సీన్లు కూడా ఉన్నాయట. అయితే ఇటీవల సూర్య హీరోగా వచ్చిన "7th సెన్స్" సినిమాలో సూర్య పాత్రకి పేరడీలో ఆలీ నటించాడని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. ఇదెంతవరకూ నిజమో తెలియదు కానీ పూరీ జగన్నాథ్ ప్రతి సినిమాలో ఆలీకి ఒక ప్రత్యేక తరహా పాత్ర ఉంటుందనేది మనందరికీ తెలిసిన విషయమే.