English | Telugu

మళ్ళీ పెళ్ళి.. నాగ్‌ మాటను కాదంటాడా? అదే తప్పు చేస్తాడా?

గత కొంత కాలంగా నాగచైనత్య రెండో పెళ్ళి విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. చైతు రెండో పెళ్ళికి రెడీ అయ్యాడా? అయితే ఎవరిని చేసుకుంటాడు? శోభిత దూళిపాళ్ళతో డేటింగ్‌లో వున్నాడు కదా! ఆమెనే చేసుకుంటాడా? లేదు.. మొదటి పెళ్ళికి చేసిన తప్పు మరోసారి చెయ్యకూడదని తండ్రి నాగ్‌ చెప్పిన అమ్మాయినే లైప్‌ పార్టనర్‌గా స్వీకరిస్తాడా?.. ఈ ప్రశ్నలు నెటిజన్ల మనసుల్ని తొలిచేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల నాగచైతన్య తన పెళ్ళి విషయంలో క్లారిటీతో ఉన్నాడని, తండ్రి చూపించిన అమ్మాయినే పెళ్ళి చేసుకుంటాడనే వార్తలు కూడా వచ్చాయి. 
తాజాగా మరో వార్త నెట్టింట సందడి చేస్తోంది. ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం... చైతు తన పెళ్ళి విషయంలో తుది నిర్ణయం తనదై ఉండాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. చైతు, శోభిత చాలాకాలంగా డేటింగ్‌లో ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఉన్న చాలా ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే చైతు ఈసారి చేసుకోబోయే అమ్మాయి సినిమాకి సంబంధించినది కాదని ఈమధ్య వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజం లేదని ఆ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనం వల్ల తెలుస్తోంది. చైతు, శోభిత ఇప్పటికీ డేటింగ్‌లో ఉన్నారని, వారి బంధం మరింత బలబడుతోందని, త్వరలోనే వారిద్దరి రిలేషన్‌ షిప్‌ గురించి ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని ఆ పత్రిక పేర్కొంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నారని, ఈ విషయం వారి సన్నిహిత వర్గాల ద్వారా తెలిసిందని ఆ పత్రిక తన కథనంలో తెలియజేసింది. మరి ఈ కొత్త కథనంలో ఎంతవరకు నిజం ఉందో? చైతు చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసుకోవాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.