English | Telugu

ఆ హీరోతో నటించొద్దని జాన్వీకి కండీషన్‌ పెట్టిందెవరు?.. ఎందుకు?

ఇండియా లెవల్‌లో లెజండరీ హీరోయిన్‌ శ్రీదేవికి ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఆమె నట వారసురాలిగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్‌ తొలి సినిమా ‘ధడక్‌’తోనే సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌ అనిపించుకుంది. ఆ సినిమా తర్వాత వరసగా సినిమాలు చేస్తూనే ఉంది. టాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వబోతుందని చాలాకాలంగా వార్తలు వచ్చాయి. అయితే మొత్తానికి ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దేవర’ చిత్రంతో టాలీవుడ్‌ని షేక్‌ చేసేందుకు జాన్వీ రెడీ అయింది. ఓ పక్క టాలీవుడ్‌లో లెగ్‌ పెడుతూనే కోలీవుడ్‌పై కూడా ఓ కన్నేసిందని తెలుస్తోంది. తమిళ్‌లోనూ తనకు నటించాలని వుందని చెబుతోంది జాన్వీ. తమిళ్‌ సినిమాలు ఎలా వుంటాయో తెలుసుకునేందుకు ఈమధ్య తమిళ్‌ సినిమాలు చూస్తోందట. ఆమె తమిళ్‌ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోందని సమాచారం. 


ఇదిలా ఉంటే.. జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చే సినిమాలో అజిత్‌గానీ, విజయ్‌గానీ హీరో అయి ఉండాలన్నది బోనీకపూర్‌ కోరిక. ఇంతవరకు బాగానే ఉంది.  తమిళ్‌లో ఎవరితో నటించినా ఫర్వాలేదు. ఒక్కరిని మాత్రం ఎవాయిడ్‌ చెయ్యాలని జాన్వీకి ఓ కండీషన్‌ పెట్టాడట బోనీ. పేరుకి తమిళ్‌ హీరో అయినా టాలీవుడ్‌, బాలీవుడ్‌, హాలీవుడ్‌... ఇలా ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్‌ ఉన్న ధనుష్‌తో మాత్రం నటించొద్దని తన కూతురు జాన్వికపూర్‌కి హితవు పలికాడు బోనీ కపూర్‌. అలా ఎందుకు చెప్పి ఉంటాడని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇందులో నిజమెంతుందో తెలీదు గానీ, ఈ వార్త మాత్రం వైరల్‌ అవుతోంది. ఈ విషయం గురించి నెటిజన్లు తీవ్రంగా చర్చించుకుంటున్నారు.