English | Telugu

డార్లింగ్ కి కూడా వీక్ నెస్ ఉందా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. యావత్ భారత్ కి డార్లింగ్ స్టార్. 'బాహుబలి' సిరీస్ తో పాన్ ఇండియా ఇమేజ్ పొందిన ప్రభాస్.. ప్రస్తుతం పలు భారీ బడ్జెట్ మూవీస్ లో నటిస్తున్నారు. వాటిలో 'సలార్', 'కల్కి 2898AD' రెండు భాగాలుగా రాబోతున్నాయి.

ఇక వీటితో పాటు మారుతి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నారు ప్రభాస్. ఇందులో డార్లింగ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారట. ఫ్లాష్ బ్యాక్ లో ఉండే క్యారెక్టర్ ఒకటి అయితే.. ప్రెజెంట్ టైమ్ లో నడిచే పాత్ర మరొకటి. ఇదిలా ఉంటే, మారుతి తన ప్రతీ సినిమాలోనూ హీరోలకి ఏదో ఒక వీక్ నెస్ ని సెట్ చేస్తుంటారు. ఇదే శైలిని ప్రభాస్ మూవీలోనూ కొనసాగించనున్నారట. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ప్రభాస్ పాత్రకి ఓ డిఫరెంట్ వీక్ నెస్ ఉందని తెలిసింది. అది చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుందట. ఇంతకీ ఆ వీక్ నెస్ ఏంటో.. సినిమా వచ్చే వరకు ఆసక్తికరమే. కాగా, వచ్చే ఏడాదిలో ప్రభాస్, మారుతి కాంబో మూవీ థియేటర్స్ లో సందడి చేసే అవకాశముంది.