English | Telugu
విజయ్ చివరి సినిమాలో ట్విస్ట్.. హీరోగా చెయ్యాల్సిన కమల్ గెస్ట్‌గా మారాడు!
Updated : Jul 23, 2024
గత కొంతకాలంగా దళపతి విజయ్ సినిమాలకు స్వస్తి పలుకుతున్నాడని, రాజకీయాల్లోకి వస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘ది గోట్’ అనే సినిమా చేస్తున్నాడు విజయ్. ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఇందులో విజయ్ డూయల్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత విజయ్ 69వ సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుంది. అతని కెరీర్‌లో ఇదే చివరి సినిమా అనే మాట వినిపిస్తోంది. ఈ సినిమాకి దర్శకుడు హెచ్.వినోద్. మొదట ఈ కథను కమల్‌హాసన్ కోసం రెడీ చేశాడట. దీనికి సంబంధించిన కథా చర్చల్లో కూడా కమల్ పాల్గొన్నాడు. చాలా కాలం ఈ కథపై ఇద్దరూ కసరత్తు చేశారు. స్టోరీ ఫైనల్ అయ్యే సమయానికి కొన్ని కారణాల వల్ల ఆ కథను పక్కన పెట్టారు.
ఇప్పుడు కమల్ కోసం రెడీ చేసిన కథతోనే విజయ్ హీరోగా సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు వినోద్. ఇది పూర్తిగా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే కథ కావడంతో తన రాజకీయ ప్రవేశానికి ఎంతగానో ఉపయోగపడుతుందని విజయ్ నమ్ముతున్నాడు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే.. ఈ సినిమాలో కమల్‌హాసన్ ఓ అతిథి పాత్ర పోషించనున్నాడట. తను హీరోగా నటించేందుకు రెడీ చేసిన కథలో తనే గెస్ట్ రోల్ చేయడం అనేది వింతగానే ఉంది. ఈ వార్త స్ప్రెడ్ అవడంతో కమల్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. విజయ్ 69వ సినిమా వినోద్ డైరెక్ట్ చెయ్యబోతున్నాడు. ఆ సినిమాలో కమల్ గెస్ట్‌గా నటిస్తున్నాడు.. ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.