English | Telugu
వెంకీ, త్రివిక్రం చిత్రం మార్చి 15 నుండి
Updated : Feb 23, 2011
వెంకీ అంటే మన విక్టరీ వెంకటేష్ హీరోగా నటించగా ఇటీవల విడుదలైన "నాగవల్లి" ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అందుకని వెంకీ తాను తదుపరి నటించబోయే చిత్రం కచ్చితమైన హిట్ కావాలని చాలా పట్టుదలతో ఉన్నారు.అందుకనే త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో ఆయన ఒక చిత్రంలో నటించటానికి అంగీకరించారు.త్రివిక్రం శ్రీనివాస్ గతంలో వెంకీ నటించిన సూపర్ హిట్ చిత్రాలు"నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి" వంటి చిత్రాలకు సంభాషణల రచయితగా పనిచేశారు. దర్శకుడు తేజ దర్శకత్వంలో వెంకీ "సావిత్రి" అనే చిత్రంలో నటిస్తారని ముందు వినపడినా, ప్రస్తుతం వెంకీ ఆ సినిమాని పక్కన పెట్టినట్లు తెలుస్తూంది.వెంకీ, త్రివిక్రంల కాంబినేషన్ లో రాబోయే ఈ చిత్రం మార్చి 15 నుండి ప్రారంభం కానుంది.ఈ చిత్రాన్ని ఈ సంవత్సరం దసరా పర్వదినం సందర్భంగా అక్టోబర్ నెలలో విడుదల చేస్తారని వినికిడి.