English | Telugu

రీచా గంగోపాథ్యాయ చీర సమస్య

అమెరికాలో పెరిగిన బెంగాలీ అమ్మాయి తెలుగులో, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో, రానా హీరోగా నటించిన తొలి చిత్రం"లీడర్" ద్వారా హీరోయిన్ గా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన రీచా గంగోపాథ్యాయకు చీర వల్ల పెద్ద సమస్య వచ్చిపడింది. తోలి చిత్రం "లీడర్"లోనూ తర్వాత ఆమె నటించిన "నాగవల్లి, మిరపకాయ్" చిత్రాల్లోనూ రీచా గంగోపాథ్యాయ చీరకట్టుతోనే దర్శనమిచ్చింది. కానీ రీచా గంగోపాథ్యాయకు చీర కట్టటానికేం ఇబ్బంది లేదు కానీ ఈ చీర వల్ల తనకు రాబోయే సినిమాల్లో అన్నీహోమ్లీగా ఉండే పాత్రలే వస్తాయేమోనన్న భయం పట్టుకుంది.తనకు గ్లామరస్ పాత్రల్లో వివిధ డ్రెస్సుల్లో కనిపించాలన్న కోరిక ఉందట.ఈ చీర తెచ్చిన తంటావల్ల తనకు గ్లామర్ పాత్రలు రావేమోననీ, అన్నీ చీర కట్టే పాత్రలే వస్తాయేనన్నీ రీచా గంగోపాథ్యాయకు భయం పట్టుకుందట.మరి నిర్మాత, దర్శకులకు ఆమె ఆత్మఘోష ఎంతవరకూ అర్థమవుతుందో చూడాలి.