English | Telugu
చరణ్ "మెరుపు" దర్శకుడు మార్పు...?
Updated : Feb 8, 2011
మన తెలుగు సినిమాల బడ్జెట్ ఆకాశాన్నంటుతోందని "మిరపకాయ్" చిత్రం ఆడియోలో బడ్జెట్ పెంచే యువ దర్శకులందరికీ నాగబాబు గడ్డిపెట్టాడు. అయినా మరో దర్శకుడు కేవలం ఒక్క పాటకే మూడు కోట్లు ఖర్చుపెట్టించాడు.విషయానికి వస్తే ,మెగాసూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై,రామ్ చరణ్ హీరోగా,గతంలో "బంగారం" చిత్రానికి దర్శకత్వం వహించిన ధరణి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం "మెరుపు".
ఈ చిత్రం బడ్జెట్ అదుపులో లేకుండా ఇష్టం వచ్చినట్లు పెంచే పక్షంలో ఆ దర్శకుణ్ణి మార్చమని మెగాస్టార్ ఆ చిత్ర నిర్మాతలను ఆదేశించినట్లు ఫిలిం నగర్ వర్గాల భోగట్టా.ఇదే జరిగేతే ఈ సంఘటన చూసైనా మిగిలిన భారీ బడ్జెట్ యువ దర్శకులు మారతారని ఆశిద్దాం.