English | Telugu
మామ, అల్లుడు కాంబోలో మరో మల్టీస్టారర్!
Updated : Oct 11, 2023
మేనమామ వెంకటేష్, మేనల్లుడు నాగ చైతన్య కాంబినేషన్ లో 'వెంకీ మామ' అనే సినిమా వచ్చింది. బాబీ డైరెక్ట్ చేసిన ఈ మల్టీస్టారర్ 2019 డిసెంబర్ లో విడుదలై బాక్సాఫీస్ విన్నర్ గా నిలిచింది. మామ, అల్లుడు కలయికలో వచ్చిన ఈ సినిమాని దగ్గుబాటి, అక్కినేని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆదరించారు. అయితే వీరి కలయికలో మరో మల్టీస్టారర్ రాబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం శైలేష్ కొలను డైరెక్షన్ లో 'సైంధవ్' సినిమా చేస్తున్న వెంకటేష్.. ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించినట్లు న్యూస్ వినిపిస్తోంది. ఇది వెంకటేష్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందనుందని సమాచారం. అయితే ఇందులో మరో యంగ్ హీరో నటించడానికి ఛాన్స్ ఉందట. ఈ రోల్ కి నాగ చైతన్యను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వెంకీ మామతో సినిమా అంటే చైతన్య వెంటనే అంగీకరిస్తాడు అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు చైతన్య. అలాగే వెంకటేష్ నటిస్తున్న 'సైంధవ్' 2024, జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక వెంకటేష్, చైతన్య.. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయనున్న మల్టీస్టారర్ తో బిజీ అయ్యే అవకాశముంది.