English | Telugu
నాని కాపురంలో చిచ్చుపెట్టబోయిందట...!
Updated : Feb 13, 2014
నాని, వాణీకపూర్ జంటగా నటించిన తాజా చిత్రం "ఆహా కళ్యాణం". ఈ చిత్రం ఈనెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న వాణీ...నానికి పెద్ద షాక్ ఇచ్చింది. "నానితో మీకు ఎఫైర్ ఉంది కదా" అని కోలీవుడ్ మీడియా అడిగితే... "యా.. వై నాట్.. ఇట్స్ కామన్.." అని అనేసిందట. విషయం తెలుసుకున్న నాని వెంటనే..బాబోయ్ నువ్వు ఇలాంటి పనులు చేయకు అని వార్నింగ్ ఇచ్చేసరికి... జస్ట్ జోక్ చేశా అందట! మరి వాణీ నిజంగా జోక్ చేసిందా లేదా? అనే విషయం త్వరలోనే తెలియనుంది.