English | Telugu
క్రిష్ గా పవన్ కళ్యాణ్
Updated : Feb 12, 2014
"అత్తారింటికి దారేది" చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ "గబ్బర్ సింగ్ 2" చిత్రంలో నటించబోతున్నాడనే విషయం అందరికి తెలిసిందే. అయితే పవన్ తాజాగా మరో చిత్రంలో కూడా నటించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. హిందీలో అక్షయ్ కుమార్, పరేష్ రావల్ ప్రధాన పాత్రలలో నటించిన "ఓ మై గాడ్" చిత్రం ఘనవిజయం సాధించింది. ఇందులో కృష్ణుడి పాత్రలో అక్షయ్, దేవుడిపై కోర్టులో కేసుపెట్టే పాత్రలో పరేష్ రావల్ నటించారు. ఈ చిత్రాన్ని తెలుగులోకి సురేష్ ప్రొడక్షన్స్ రీమేక్ చేయనుంది. నిన్నటి వరకు కృష్ణుడి పాత్రలో వెంకటేష్ నటించబోతున్నట్లు, పరేష్ రావల్ పాత్రలో నటుడు రాజేంద్రప్రసాద్ నటించబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. కానీ ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ సినిమా గురించి మరో కొత్త న్యూస్ వస్తుంది. పరేష్ రావల్ పాత్రలో వెంకటేష్ నటించనున్నాడని, కృష్ణుడి పాత్ర పవన్ కళ్యాణ్ చేయనున్నట్లు సమాచారం. ఇటీవలే వెంకీ ఈ సినిమా గురించి పవన్ కు చెప్పగానే... వెంటనే పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని త్వరలోనే ఈ రీమేక్ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. మరి అసలే "గబ్బర్ సింగ్ 2" సినిమా కోసం చాలా జాగ్రత్త పడుతున్న పవన్ ఈ రీమేక్ సినిమాపై ఎలా స్పందిస్తాడో త్వరలోనే తెలియనుంది.