English | Telugu
ప్రేమించమని కుర్ర హీరో వెంటపడుతున్న బేబీ!
Updated : Dec 24, 2023
యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన వైష్ణవి చైతన్య.. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు చేసుకుంటూ.. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ లో మెరిసింది. అలాంటి వైష్ణవి 'బేబీ'తో హీరోయిన్ గా మారి మొదటి సినిమాతోనే ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో పాటు, వైష్ణవి నటనకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఇండస్ట్రీ దృష్టి ఆమెపై పడింది. తాజాగా ఆమె ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా చేసే అవకాశం దక్కించుకుందని తెలుస్తోంది.
దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి హీరోగా అరుణ్ అనే నూతన దర్శకుడి డైరెక్షన్ లో ఓ సినిమా రూపొందుతోంది. ఇందులో హీరోయిన్ గా వైష్ణవిని ఎంపిక చేసినట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమాకి 'లవ్ మీ' అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారట. మరి 'లవ్ మీ' అనే టైటిల్ కి తగ్గట్టుగా ప్రేమించమని హీరో హీరోయిన్ వెంట పడతాడో లేక హీరోయినే హీరో వెంటపడుతుందో చూడాలి.