English | Telugu
మహేష్ బాబుతో కలిసి వస్తున్న ఎన్టీఆర్!
Updated : Dec 24, 2023
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'దేవర'. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం 2024, ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ ఆసక్తికరంగా మారింది.
జనవరి నుంచే మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టేలా దేవర టీమ్ ప్లాన్ చేస్తోందట. ప్రస్తుతం మూవీ టీం గ్లింప్స్ ని సిద్ధం చేసే పనిలో ఉందట. దీనిని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు అదే సమయంలో జనవరి 12న విడుదలవుతున్న 'గుంటూరు కారం' సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్లలో టీజర్ ని ప్రదర్శించాలని భావిస్తున్నారట. నిజానికి డిసెంబర్ 22న విడుదలైన సలార్ సినిమాతో పాటు గ్లింప్స్ ని ప్రదర్శించనున్నారని ఆమధ్య వార్తలొచ్చాయి. కానీ అది జరగలేదు. మరి ఇప్పుడు 'గుంటూరు కారం'తో నైనా దేవర గ్లింప్స్ వస్తుందేమో చూడాలి.
అనిరుధ్ సంగీతం అందిస్తున్న దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.