English | Telugu

ప్రేమలో పడ్డాడు.. నేను పెళ్లికి రెడీ అంటున్నాడు!?

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లికి సంబంధించిన విషయాలు ఎంతో స్పీడ్‌గా జరిగిపోతుంటాయి. ప్రేమలో పడడం, దానికి సంబంధించి మీడియాలో వార్తలు రావడం, అవన్నీ వాస్తవం కాదని కొట్టిపారెయ్యడం, ఆ తర్వాత పెళ్లికి సిద్ధపడడం.. ఇలాంటి సంఘటనలు ఎప్పటి నుంచో చూస్తున్నాం. తాజాగా ఒక హీరో ప్రేమలో పడ్డాడని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడన్న వార్తలు ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి.  ఆ హీరో ఎవరో కాదు, పూరి జగన్నాథ్‌ తనయుడు పూరి ఆకాష్‌. 

కొడుకు ఆకాష్‌ని సక్సెస్‌ఫుల్‌ హీరోని చెయ్యాలన్నది పూరి జగన్నాథ్‌ ఆలోచన. అయితే ఇప్పటివరకు అతనికి ఒక్క హిట్‌ కూడా దక్కలేదు. బయటి నిర్మాత, దర్శకులు చేసిన సినిమాలు, స్వయంగా పూరి జగన్నాథ్‌ డైరెక్ట్‌ చేసిన సినిమాలు కూడా అతనికి ప్లస్‌ అవ్వలేదు. అయినప్పటికీ హీరోగా నిలబడేందుకు ఎంతో కృషి చేస్తున్నాడు ఆకాష్‌. తాజాగా పూరి ఆకాష్‌కి సంబంధించి ఓ వార్త వైరల్‌ అవుతోంది. ఆకాష్‌ లవ్‌లో ఉన్నాడని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త ఇప్పుడు స్ప్రెడ్‌ అవుతోంది. మరి ఈ వార్తపై పూరి జగన్నాథ్‌ ఎలా స్పందిస్తారో తెలీదు. ఈ వార్తలో ఎంత నిజముందనే విషయంలో కూడా ఇప్పటివరకు క్లారిటీ లేదు. దీనిపై ఆకాష్‌ స్వయంగా స్పందిస్తేనే తప్ప విషయం తెలియదు.