English | Telugu

"జల జల జలపాతం" జంటకి పెళ్ళంట.. వరుణ్, లావణ్య బాటలో వైష్ణవ్, కృతి!?

'ఉప్పెన' చిత్రంలో బేబమ్మ, ఆసిగా ప్రేమికుల పాత్రల్లో ఒదిగిపోయారు కృతి శెట్టి, వైష్ణవ్ తేజ్. ఆ సినిమాలో ఆ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ.. "జల జల జలపాతం" పాటలో రొమాన్స్ యువతరాన్ని పదే పదే థియేటర్లకు రప్పించింది. ఇద్దరికి కూడా ఇది డెబ్యూ మూవీ కావడం.. సినిమా సెన్సేషనల్ హిట్ కావడంతో టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయ్యారు వైష్ణవ్, కృతి. అంతేకాదు.. ఈ ఇద్దరు మరో సినిమాలో కలిసి నటించబోతున్నట్లు కథనాలు కూడా వచ్చాయి.

ఇదిలా ఉంటే, ఉప్పెన తరువాత ఆ స్థాయి విజయాన్ని చూడలేకపోయిన వైష్ణవ్, కృతి.. త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నట్లు ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇద్దరు కూడా పీకల్లోతు ప్రేమలో ఉన్నారని.. ఉప్పెన సమయంలో చిగురించిన ప్రేమ ఇప్పుడు పెళ్ళి వరకు వెళుతోందని చెప్పుకుంటున్నారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి లాగే వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి కూడా పెళ్ళి పీటలు ఎక్కడం ఖాయమని అంటున్నారు. లావణ్య లాగే కృతి కూడా మెగా కాంపౌండ్ లోకి తెలుగింటి కోడలుగా వెళ్ళబోతోందని చెప్పుకుంటున్నారు. మరి.. వైష్ణవ్, కృతి పెళ్ళి వార్తల్లో నిజమెంత? ఈ కథనాలకు బేబమ్మ, ఆసి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.