English | Telugu

గ్యాంగ్ స్టర్ గా మహేశ్.. మరో 'పోకిరి' అవుతుందా?

సూపర్ స్టార్ మహేశ్ బాబు గ్యాంగ్ స్టర్ అవతారమెత్తనున్నారా? అవునన్నదే ఫిల్మ్ నగర్ బజ్.

ఆ వివరాల్లోకి వెళితే.. అర్జున్ రెడ్డితో ఇండస్ట్రీ దృష్టిని తన వైపు తిప్పుకున్న సందీప్ రెడ్డి వంగా.. ప్రస్తుతం బాలీవుడ్ వైపు ఫోకస్ పెట్టారు. ఆ మధ్య కబీర్ సింగ్ తో సాలిడ్ హిట్ కొట్టిన సందీప్.. ప్రస్తుతం రణ్ బీర్ కపూర్ తో యానిమల్ చేస్తున్నారు. ఆపై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో స్పిరిట్ చేయబోతున్నారు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తోనూ ఓ మూవీ చేయబోతున్నారు.

అంతేకాదు.. మహేశ్ బాబుతోనూ సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు సందీప్.   తన కోసం ఓ పవర్ ఫుల్ స్టోరీ కూడా డిజైన్ చేసుకున్నారు. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. మాఫియా కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిదని.. ఇందులో మహేశ్ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తారని సమాచారం. అంతేకాదు.. సినిమాలో డ్రగ్స్ తో కూడా కనెక్షన్ ఉంటుందని అంటున్నారు. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. మహేశ్ ఇండస్ట్రీ హిట్ మూవీ 'పోకిరి' సినిమాలోనూ మాఫియా టచ్ ఉంటుంది. అలాగే డ్రగ్స్ కి  సంబంధించిన సన్నివేశాలు కూడా ఉంటాయి. ఇక సందీప్ 'అర్జున్ రెడ్డి'లోనూ డ్రగ్స్ టచ్ ఉంటుంది. మరి.. 'పోకిరి', 'అర్జున్ రెడ్డి' సెంటిమెంట్ ఈ కొత్త సబ్జెక్ట్ కి కూడా కలిసొస్తుందేమో చూడాలి.

కాగా, మహేశ్ తాజా చిత్రం గుంటూరు కారం సంక్రాంతికి రాబోతోంది. ఆపై రాజమౌళి దర్శకత్వంలో తన తదుపరి సినిమా ఉంటుంది. అదయ్యాకే సందీప్ రెడ్డి కాంబో మూవీ ఉండొచ్చు.