English | Telugu

సీనియర్ హీరో మనవరాలితో ఉస్తాద్ హీరో పెళ్ళి!

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఇంట పెళ్ళి బాజాలు మోగబోతున్నాయి. ఆయన రెండో కుమారుడు శ్రీ‌ సింహాకి పెళ్ళి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సీనియర్ నటుడు మురళీమోహన్ మనవరాలుని శ్రీ‌ సింహా పెళ్ళి చేసుకోబోతున్నట్లు సమాచారం.

'మత్తు వదలరా' సినిమాతో తెలుగుతెరకు హీరోగా పరిచయమైన శ్రీ‌ సింహా మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా, నటుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అతను చేసిన 'తెల్లవారితే గురువారం', 'దొంగలున్నారు జాగ్రత్త', 'భాగ్‌ సాలే', 'ఉస్తాద్' సినిమాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. ప్రస్తుతం శ్రీ‌ సింహా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో అతను పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.