English | Telugu

ఎన్టీఆర్ ‘దేవర’ లో మరో హీరోయిన్?

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్  నుంచి రాబోతున్న మూవీ దేవర. శరవేగంగా  చిత్రీకరణ  జరుపుకుంటున్న దేవర మూవీకి కొరటాల శివ దర్శకుడు. ఎన్టీఆర్ సరసన తెలుగు ,హిందీ చిత్ర సీమల్ని ఒకప్పుడు  తన అందంతో నటనతో ఒక ఊపు ఊపేసిన శ్రీదేవి  కూతురు జాన్వికపూర్  హీరోయిన్ గా నటిస్తుంది. జాన్వీ కపూర్ కి ఇదే తొలి తెలుగు సినిమా. తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న ఒక వార్త సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.

ఎన్టీఆర్ కి  సినిమా లో సరైన పాత్ర పడాలే కానీ ఆ పాత్రలో వీరవిహారం చెయ్యడం ఎన్టీఆర్ స్పెషాలిటీ.  అలాగే  తను నటించే పాత్రని ప్రేక్షకులు కన్నార్పకుండా  చూసేలా చెయ్యడం కూడా ఎన్టీఆర్ స్పెషాలిటీ. ఇప్పుడు దేవర ద్వారా మరోసారి  తన నటన కి ఉన్న కెపాసిటీ ని చూపించడానికి సిద్ధం అవుతున్నాడు. ఈ మూవీ లో జాన్వికపూర్ కాకుండా ఇంకో హీరోయిన్ కూడా నటించబోతుందనే వార్త  ఫిలిం నగర్లో చక్కెర్లు కొడుతుంది. కొరటాల శివ దేవర ని రెండు పార్టులుగా  తెరకెక్కిస్తున్నాడని  విషయం అందరికి తెలిసిందే. అధికారకంగా కూడా చిత్ర బృందం ఆ విషయాన్ని ప్రకటించింది. 

ఇప్పుడు ఈ రెండో పార్ట్ లోనే  ఇంకో హీరోయిన్ ఉండబోతుంది. మొదటి పార్ట్ లో ఆ హీరోయిన్ పాత్ర సుమారు 10  నిముషాలు పాటు ఉండి సెకండ్ పార్ట్ లో ఫుల్ ఫెడ్జ్ గా  ఉంటుంది. అయితే   దేవర లో రెండో హీరోయిన్  విషయం గురించి చిత్ర బృందం అధికారంగా ఎక్కడ ప్రకటించలేదు. ఇక నందమూరి అభిమానులతో పాటు ఎన్టీఆర్ అభిమానులు దేవర సినిమా మీద భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఆల్రెడీ రిలీజ్ అయిన ఎన్టీఆర్ గెటప్ తో  సాధారణ సినీ ప్రేక్షకులు కూడా దేవర మూవీ మీద ఎన్నో అంచనాలని పెట్టుకున్నారు. ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జట్ తో దేవర రూపొందుతుంది. ఆల్రెడీ ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో  వచ్చిన జనతా గ్యారేజ్ మూవీ ఘన విజయం సాధించిన విజయం అందరికి విదితమే.