English | Telugu
'కన్నప్ప'లో ప్రభాస్ తో పాటు మరో ఇద్దరు స్టార్లు.. ఎవరో తెలుసా!
Updated : Sep 11, 2023
మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ 'కన్నప్ప' ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాలో శివుడి పాత్రలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించనున్నారని దాదాపు క్లారిటీ వచ్చేసింది. అయితే ఈ ప్రాజెక్ట్ లో ప్రభాస్ తో పాటు మరో ఇద్దరు స్టార్లు సందడి చేయనున్నారని తెలుస్తోంది.
'కన్నప్ప' చిత్రంలో మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్నాడనే న్యూస్ తో 'కన్నప్ప' రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ రాకతో మరో స్థాయికి వెళ్ళేలా ఉంది.
ప్రభాస్ కి పాన్ ఇండియా స్టార్ గా తిరుగులేని ఇమేజ్ ఉంది. ఆయన సినిమాలో ఉంటే.. బిజినెస్ ఎన్నో రెట్లు పెరగడంతో పాటు. వందల కోట్లు వసూళ్లు వస్తాయి అనడంలో సందేహం లేదు. ఇక మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ కూడా తోడైతే సినిమా స్థాయి మరింత పెరుగుతుంది. వారికి వారి రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపు ఉంది. ఇటీవల ఈ ఇద్దరూ సూపర్ స్టార్ రజినీకాంత్ బ్లాక్ బస్టర్ 'జైలర్'లో సందడి చేశారు. ఉన్నది కాసేపే అయినా వారు స్క్రీన్ కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లాయి. ఇప్పుడు ఈ జైలర్ ద్వయం 'కన్నప్ప'కి కూడా కలిసొస్తుందేమో చూడాలి.