English | Telugu

సంక్రాంతికి బన్నీ, త్రివిక్రమ్ సినిమా.. గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు!


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి అచ్చొచ్చిన దర్శకుల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురములో'.. ఇలా ఇప్పటివరకు ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ మంచి విజయం సాధించాయి. కట్ చేస్తే.. త్వరలో ఈ ఇరువురు మరోమారు జట్టుకట్టనున్న సంగతి తెలిసిందే. అల వైకుంఠపురములో చిత్రాన్ని నిర్మించిన గీతా ఆర్ట్స్, హాసిని అండ్ హారిక క్రియేషన్స్ సంస్థలే ఈ మూవీని కూడా నిర్మించనున్నాయి.

ఇదిలా ఉంటే, బన్నీ త్రివిక్రమ్ ఫోర్త్ జాయింట్ వెంచర్ ని 2024 ఏప్రిల్ లో ప్రారంభించి.. 2025 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అదే గనుక నిజమైతే.. అల వైకుంఠపురములో (2020) తరహాలో ఈ సినిమా కూడా సంక్రాంతి సెంటిమెంట్ ని రిపీట్ చేయబోతున్నట్లే. 

కాగా, అల్లు అర్జున్ తాజా చిత్రం 'పుష్ప ది రూల్' చిత్రీకరణ దశలో ఉంది. 2024 వేసవిలో ఈ సినిమా థియేటర్స్ లోకి వస్తుంది. మరోవైపు త్రివిక్రమ్ కొత్త చిత్రం 'గుంటూరు కారం' 2024 సంక్రాంతికి రాబోతోంది. ఇందులో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్నాడు.