English | Telugu
'ఎన్టీఆర్ 30'లో రష్మిక, జాన్వీ!
Updated : Dec 25, 2022
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించనున్న 'ఎన్టీఆర్ 30' లాంచ్ కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో.. ఈ మూవీలో నటించే హీరోయిన్ ఎవరో తెలుసుకోవడానికి కూడా అంతే ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఇద్దరు నటించనున్నారని తెలుస్తోంది.
'ఎన్టీఆర్ 30'లో హీరోయిన్ గా ఇప్పటిదాకా ఎన్నో పేర్లు వినిపించాయి. కొంతకాలంగా జాన్వీ కపూర్, రష్మిక మందన్న పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జాన్వీ పేరు దాదాపు ఖరారైనట్లు వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని.. జాన్వీ, రష్మిక ఇద్దరూ ఈ చిత్రంలో సందడి చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.
సంక్రాంతికి 'ఎన్టీఆర్ 30' మూవీ లాంచ్ కానుందని.. జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశముందని సమాచారం.