English | Telugu

సుకుమార్ దర్శకత్వంలో ప్రభాస్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో 'సలార్', 'ఆదిపురుష్', 'ప్రాజెక్ట్ కె' వంటి భారీ చిత్రాలు ఉన్నాయి. అలాగే మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుండటంతో పాటు.. సందీప్ రెడ్డి దర్శకత్వంలో 'స్పిరిట్' అనే చిత్రాన్ని ప్రకటించాడు. ఇక ఇప్పుడు ఇప్పుడు మరో ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించనున్నాడని సమాచారం.

'పుష్ప-1'తో పాన్ ఇండియా స్థాయి గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్.. ప్రస్తుతం 'పుష్ప-2'తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన చేయబోయే చిత్రం ప్రభాస్ తోనే అని ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజుల క్రితం సుకుమార్.. కాశ్మీర్ ఫైల్స్ దర్శకనిర్మాతలు వివేక్ అగ్నిహోత్రి, అభిషేక్ అగర్వాల్ ని కలిసిన సంగతి తెలిసిందే. వివేక్ అగ్నిహోత్రి సహా నిర్మాతగా,  అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్న చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించనున్నాడని ఆ సమయంలో వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో ప్రభాస్ నటించనున్నాడని టాక్ వినిపిస్తోంది. 'పుష్ప-2' పూర్తయ్యాక ఈ మూవీ అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.