English | Telugu
అల్లు అర్జున్ ప్లేస్ లో రవితేజ..త్రివిక్రమ్ రూటు మారింది!
Updated : Jan 20, 2024
త్రివిక్రమ్ తన నయా మూవీ గుంటూరు కారంతో కొంచం వెనకపడ్డాడు. మూస పద్దతిలోనే ఆ మూవీ కథ కథనాలు ఉన్నాయనే విమర్శలని త్రివిక్రమ్ చాలా గట్టిగానే ఎదుర్కున్నాడు. ఇప్పుడు గుంటూరు కారం బాక్స్ ఆఫీస్ వద్ద సాధిస్తున్న కలెక్షన్లు మొత్తం మహేష్ ఖాతాలోకే వెళ్తున్నాయి.ఇక పోతే త్రివిక్రమ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేస్తున్నాడనే విషయం చాలా మంది సినీ ప్రేమికులకి తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ప్లేస్ లోకి వేరో హీరో మూవీ వచ్చి చేరిందనే ఒక రూమర్ ఫిలిం సర్కిల్స్ లో వినపడుతుంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ తో సినిమా కంటే ముందు మాస్ మహారాజా రవితేజ తో ఒక మూవీ చేయబోతున్నాడనే వార్తలు చాలా గట్టిగానే వినపడుతున్నాయి. వీలైనంత త్వరగా షూటింగ్ ని ప్రారంభించి అంతే త్వరగా మూవీని కంప్లీట్ చేసే ప్లాన్ లో కూడా ఉన్నారని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే సంగీత దర్శకుడుగా దేవిశ్రీప్రసాద్ ని కన్ఫర్మ్ చేసారని ఆయన అదిరిపోయే ట్యూన్స్ ని రెడీ చేస్తున్నాడనే మాటలు కూడా వినపడుతున్నాయి.
త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించే ఈ నూతన చిత్రం గురించి అధికారకంగా అతి త్వరలోనే ప్రకటన కూడా వస్తుందని అంటున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలని చూసిన ఇద్దరి ఫ్యాన్స్ మాత్రం ఆ సినిమా తెరకెక్కాలని కోరుకుంటున్నారు.రవి తేజ ఎనర్జీ కి త్రివిక్రమ్ పెన్ పంచ్ తోడైతే థియేటర్స్ లో కొత్త రకం నవ్వులు పూయడం ఖాయమని అంటున్నారు. అల్లు అర్జున్ పుష్ప 2 కి సంబంధించిన పనులు మొత్తం కంప్లీట్ చేసుకునే లోపు త్రివిక్రమ్ రవితేజ మూవీ ని కంప్లీట్ చేస్తాడని ఆ తర్వాతే బన్నీ సినిమా ఉంటుందని అంటున్నారు.