English | Telugu
శర్వానంద్ కి అమ్మగా త్రిష.. ఏ సినిమా కోసమో తెలుసా!
Updated : Aug 2, 2023
టాలెంటెడ్ హీరో శర్వానంద్, సౌత్ క్వీన్ త్రిష ఇంచుమించుగా ఒకే టైమ్ లో కెరీర్ ప్రారంభించారు. అయితే ఇప్పటివరకు ఈ ఇద్దరు కలిసి నటించనేలేదు. త్వరలో శర్వానంద్, త్రిష జట్టుకట్టనున్నారని సమాచారం. ట్విస్ట్ ఏంటంటే.. ఇందులో శర్వానంద్ కి అమ్మగా త్రిష కనిపించనుందట.
ఆ వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా 'సోగ్గాడే చిన్ని నాయనా', 'బంగార్రాజు' చిత్రాల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇందులో చిరుకి జంటగా త్రిష ఎంటర్టైన్ చేయనుందని టాక్. 'స్టాలిన్' (2006) తరువాత ఈ కాంబోలో వస్తున్న సినిమా ఇది. కాగా ఇదే చిత్రంలో మెగాస్టార్ కి తనయుడిగా 'డీజే టిల్లు' ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ నటిస్తాడని ఆ మధ్య జోరుగా ప్రచారం సాగింది. అయితే కొన్ని కారణాల వల్ల సిద్ధు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని.. ఇప్పుడా స్థానంలో శర్వానంద్ దర్శనమివ్వనున్నాడని చెప్పుకుంటున్నారు. అదే గనుక నిజమైతే.. శర్వానంద్ కి అమ్మగా త్రిష నటిస్తున్నట్లే. నిజజీవితంలో త్రిష కంటే శర్వానంద్ కేవలం ఒక ఏడాది మాత్రమే చిన్నవాడు కావడం విశేషం. త్వరలోనే చిరంజీవి సినిమాలో శర్వానంద్ ఎంట్రీపై క్లారిటీ రానుంది.