English | Telugu
ఓర్నీ..'జైలర్'లో తమన్నా హీరోయిన్ కాదా!
Updated : Aug 2, 2023
"వా.. నువ్వు కావాలయ్యా.. నువ్వు కావాలయ్యా.." అంటూ సోషల్ మీడియాని తెగ ఊపేస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా. సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ రోల్ లో నటించిన 'జైలర్' కోసం తమన్నా నర్తించిన పాట ఇది. మొదట్లో మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది.. కనిపిస్తోంది. మొత్తానికి 'కావాలయ్యా' పాట పుణ్యమా అని తమన్నా మరోసారి టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయిపోయింది.
ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే.. 'జైలర్'లో తమన్నా మెయిన్ హీరోయిన్ కాదంట. రజినీకాంత్ కి జోడీగా కనిపించేది సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ అని బజ్. తమన్నాది కేవలం కొద్ది నిమిషాల పాటు కనిపించే పాత్రేనట. అంతేకాదు.. తమిళ వెర్షన్ లో తను తెలుగు అమ్మాయిగా కనిపిస్తే.. తెలుగు వెర్షన్ లో తమిళమ్మాయిగా దర్శనమిస్తుందట. మరి.. ఈ కథనాల్లో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, 'జైలర్' ఈ నెల 10న థియేటర్స్ లోకి రానుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అనిరుధ్ బాణీలు అందించాడు.