English | Telugu

ప్రభాస్ సరసన శ్రీలీల.. జోడి బాగుంటుందా?

ఏ ముహూర్తాన యంగ్ బ్యూటీ శ్రీలీల తెలుగు చిత్ర రంగంలోకి ప్రవేశించిందో గాని ఏ తెలుగు అగ్ర హీరో నటించిన సినిమా చూసినా, అగ్ర హీరో నుంచి రాబోయే కొత్త  సినిమా చూసినా అందులో హీరోయిన్ గా శ్రీ లీల ఫిక్స్ . ప్రస్తుతం శ్రీ లీల హీరోయిన్ గా చేస్తున్న చాలా సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. తాజాగా తను హీరోయిన్ గా చేసిన 'స్కంద' మూవీ విడుదల కి సిద్ధం అవ్వబోతుండగా వచ్చే నెలలో బాలకృష్ణ హీరోగా నటించిన 'భగవంత్ కేసరి' విడుదల కాబోతుంది. అలాగే పవన్ కళ్యాణ్ కొత్త మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ లోను ,మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమాలోను అలాగే ఇంకొన్ని బడా హీరోల సినిమాల్లోను శ్రీ లీల హీరోయిన్ గా చేస్తుంది.

ఇంక అసలు విషయానికి వస్తే తాజాగా శ్రీ లీల హీరోయిన్ గా  చెయ్యడానికి ఒప్పుకున్న సినిమా గురించి సోషల్ మీడియా లో సంచలనం సృష్టిస్తుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, క్రేజీ డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్ లో ఒక చిత్రం రూపు దిద్దుకోబుతుంది. ప్రభాస్ ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాల తర్వాత హను డైరెక్షన్ లో  సినిమా చెయ్యడానికి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్త గతంలోనే వచ్చింది. ఆ మూవీ లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా శ్రీ లీల ని ఎంపిక చేసారు అనే  టాక్ చాలా బలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో వినపడుతుంది. అదే కనుక నిజమైతే శ్రీ లీల రేంజ్ ఇంకో లెవల్లోకి వెళ్లిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభాస్ ప్రస్తుతం తెలుగు సినిమా హీరో కాదు పాన్ ఇండియా హీరో. కాబట్టి శ్రీ లీల క్రేజ్ పాన్ ఇండియా రేంజ్ కి వెళ్ళిపోతుంది. అదే జరిగితే అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటవచ్చు.