English | Telugu
ముగ్గురికీ హిట్ కావాలి.. అందుకే ఇలా కలిసారు!
Updated : Nov 22, 2023
బెల్లంకొండ శ్రీనివాస్.. నిర్మాత కొడుకుగా ఇండస్ట్రీకి వచ్చి తన టాలెంట్‌తో హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అతను చేసిన సినిమాలన్నీ భారీ బడ్జెట్ సినిమాలే. అయితే శ్రీనివాస్ సినిమాలకు హిందీలో మంచి క్రేజే ఉంది. అందుకే అతను హీరోగా నటించిన సినిమాలన్నీ హిందీలోకి డబ్ అవుతుంటాయి. ఇతని సినిమాలకు యూట్యూబ్‌లో మంచి గిరాకీ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ‘ఛత్రపతి’ రీమేక్‌తో బాలీవుడ్‌లో జెండా పాతాలని ప్రయత్నించాడు శ్రీనివాస్. కానీ, కథ అడ్డం తిరిగింది. సినిమా డిజాస్టర్ కావడంతో టాలీవుడ్‌లోనే తన ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ప్రస్తుతం 14 రీల్స్ సంస్థకు ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు మరో సినిమా సెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నిర్మాత అనిల్ సుంకర ఇటీవలికాలంలో రెండు భారీ సినిమాలతో భారీ మొత్తంలోనే నష్టపోయాడు. అఖిల్‌తో చేసిన ఏజెంట్, మెగాస్టార్‌తో చేసిన భోళా శంకర్ సినిమాలు అనిల్‌ను కోలుకోలేని దెబ్బ తీశాయి. మళ్ళీ ఓ హిట్ సినిమాతో ఫామ్‌లోకి రావాలని చూస్తున్నాడు. మంచి హీరో, మంచి దర్శకుడు దొరికితే సినిమా స్టార్ట్ చెయ్యాలని ఉత్సాహంగా ఉన్నాడు.
ప్రదీప్‌తో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే సినిమా తీసి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్నాడు మున్నా. ఈ సినిమా నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టింది. డిజిటల్‌లో కూడా ఈ సినిమాను ప్రేక్షకులు ఎక్కువ సార్లు చూశారు. అయితే మున్నాకు దర్శకుడుగా రెండో సినిమా చేసే అవకాశం రాలేదు. అతను కూడా తనతో సినిమాలు చేసే హీరోల కోసం, నిర్మాతల కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే 14 రీల్స్‌లో ఓ సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. అయితే అది ఆలస్యం అయ్యేలా ఉంది. అందుకే మరో నిర్మాత కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ముగ్గురూ కలిసారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా మున్నా దర్శకత్వంలో అనిల్ సుంకర ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. కథ ఓకే అయిందని త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.