English | Telugu

అనసూయతో నయనతార సినిమా రీమేక్‌.. రచ్చ చేస్తున్న నెటిజన్లు!

బుల్లితెరపైనే కాదు, బిగ్‌ స్క్రీన్‌పై సైతం తన అభినయంతో అందర్నీ ఆకట్టుకుంటున్న అనసూయ.. వరస సినిమాలతో బిజీ అయిపోతోంది. ఓ పక్క సినిమాలు చేస్తూనే సోషల్‌ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ అభిమానుల్ని అలరిస్తోంది. ఇప్పుడు అనసూయకు సంబంధించిన ఓ న్యూస్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అనసూయ ఓ లేడీ ఓరియంటెడ్‌ మూవీ చేయబోతోంది. అది కూడా నయనతార హీరోయిన్‌గా నటించిన ఓ తమిళ హిట్‌ సినిమాను తెలుగులో రీమేక్‌ చేస్తున్నారట. ఆ క్యారెక్టర్‌కు అనసూయ పర్‌ఫెక్ట్‌గా సరిపోతుందని భావించిన దర్శకనిర్మాతలు ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారని తెలుస్తోంది. తమిళ నేటివిటీ ఎక్కువగా ఉన్న ఆ సినిమాను తెలుగులో చెయ్యాలంటే ఎక్కువ మార్పులు అవసరం అవుతాయని దర్శకుడు భావించడంతో ప్రస్తుతం మార్పులు చేసే పనిలో ఉన్నారట. 

సోషల్‌ మీడియాలో వస్తున్న ఈ వార్తపై నెటిజన్లు స్పందిస్తూ.. నయనతార సినిమాను రీమేక్‌ చెయ్యాల్సిన అవసరం ఏమొచ్చింది? యాజిటీజ్‌గా డబ్బింగ్‌ చేసేస్తే చాలు కదా.. అనసూయతో చేసి ఆ సినిమాను ఎందుకు చెడగొట్టడం అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు. ఆ సినిమా గురించి తెలిసిన కొందరు నెటిజన్లు మాత్రం ఆ క్యారెక్టర్‌కు అనసూయ పర్‌ఫెక్ట్‌ అంటున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఇప్పటివరకు అఫీషియల్‌గా ఎటువంటి అప్‌డేట్‌ లేదు. కానీ, సినిమా గురించి మాత్రం అందరూ డిస్కస్‌ చేసుకుంటున్నారు. ఇదే నిజమైతే మరోసారి తన నటనతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించేందుకు అనసూయ రెడీ అవుతోందన్నమాట.