English | Telugu

‘చంద్రముఖి 2’లో కంగనా రావడం వెనుక అసలు కథ అదన్నమాట!!

రజనీకాంత్‌ ‘చంద్రముఖి’ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో చంద్రముఖిగా జ్యోతిక నటన అందర్నీ ఆకట్టుకుంది. ఇప్పుడు 18 సంవత్సరాల తర్వాత సీక్వెల్‌గా రాబోతున్న ‘చంద్రముఖి 2’లో కంగనా రనౌత్‌ నటించింది. ఈ సినిమా సెప్టెంబర్‌ 15న విడుదల కానుంది. కంగనా ఏమిటి? చంద్రముఖి ఏమిటి? అని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే దాని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. 
మొదట ‘చంద్రముఖి 2’ కోసం కాజల్‌ను సంప్రదించారు. ఆమె చేయడానికి అంగీకరించినప్పటికీ బిజీ కారణంగా ఆమె డేట్స్‌ ఎడ్జస్ట్‌ అవ్వకపోవడం వల్ల ఆమె చేయలేకపోయింది. ఇక కంగనా ఎలా సెలెక్ట్‌ అయ్యిందంటే... వాస్తవానికి చంద్రముఖి కథ విని కంగనా ఓకే చెప్పలేదట. దర్శకుడు పి.వాసు వేరే కథ నేరేట్‌ చెయ్యడానికి వెళ్లినపుడు ‘చంద్రముఖి 2’ చేస్తున్నారని తెలిసి, దాని గురించి అడిగి తెలుసుకుంది. ఆమెకు నచ్చడంతో ఆ క్యారెక్టర్‌ చేస్తానని తనే ముందుకు వచ్చింది. దీనికంటే ముందు మరో హీరోయిన్‌ దగ్గరకు కూడా ఈ ప్రపోజల్‌ వెళ్ళింది. అది ఎవరో కాదు, సాయిపల్లవి. ఆమె చేస్తానని ఓకే చెప్పింది. అయితే క్లైమాక్స్‌లో కొన్ని మార్పులు చేయాలని సాయిపల్లవి సూచించిందట. ఆ విషయం తెలుసుకున్నారు దర్శకుడు పి.వాసు. అయితే దాని గురించి అతను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సాయిపల్లవి కూడా మళ్ళీ ఆ సినిమా ప్రస్తావన తీసుకురాలేదట. అలా సాయిపల్లవి ఈ సినిమాలో మిస్‌ అయ్యింది.