English | Telugu

చరణ్ కి ఒకరు సరిపోరు.. ఇద్దరు కావాలి.. 

ఆర్ ఆర్ ఆర్ తో గ్లోబల్ స్టార్ అయిపోయారు రామ్ చరణ్. దీంతో తను చేసే ప్రతీ సినిమాపై స్పెషల్ ఫోకస్ ఉంటోంది. ప్రస్తుతం సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నారు చరణ్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్.. వచ్చే ఏడాది తెరపైకి రాబోతోంది.

ఇదిలా ఉంటే, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలోనూ రామ్ చరణ్ ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ స్పోర్ట్స్ డ్రామాకి స్వర మాంత్రికుడు ఎ.ఆర్. రెహమాన్ బాణీలు అందించనున్నారు. కాగా, ఈ చిత్రంలో కథానుసారం ఇద్దరు నాయికలు సందడి చేయనున్నారట. రెండు పాత్రలకి కూడా ప్రాధాన్యం ఉంటుందని టాక్. మరి.. ఈ మెగా మూవీలో ఛాన్స్ దక్కించుకునే హీరోయిన్స్ ఎవరో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.

గతంలో ఆరెంజ్, నాయక్, ఎవడు చిత్రాల్లో ఇద్దరేసి ముద్దుగుమ్మలతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేశారు చరణ్. దాదాపు పదేళ్ళ తరువాత మళ్ళీ ఈ తరహా సినిమాలో ఎంటర్టైన్ చేయనున్నారు రామ్ చరణ్.