English | Telugu

భారీ ఆఫర్‌ను కాదన్న నాగచైతన్య!

కొంతమంది హీరోలుగానీ, హీరోయిన్లుగానీ డబ్బే ప్రధానం అన్నట్టుగా ఉంటారు. తక్కువ రోజుల్లో ఎక్కువ రెమ్యునరేషన్‌ వస్తుందంటే చాలు దానికి ఓకే చెప్పేస్తారు. కానీ, కొందరు అలాకాదు.. డబ్బు కాదు ముఖ్యం క్యారెక్టర్‌ అని నమ్మేవారూ ఉన్నారు. ఈ సందర్భం ఎంతో మంది హీరోల కెరీర్‌లో వచ్చింది. ఇప్పుడు నాగచైతన్య వంతు అయింది. ఓ సినిమాలో స్పెషల్‌ క్యారెక్టర్‌ చేస్తే 9 కోట్లు సింగిల్‌ పేమెంట్‌ ఇస్తామని ఆ సినిమా మేకర్స్‌ ఆఫర్‌ ఇచ్చారు. ఆ సినిమాలో మెయిన్‌ హీరో వేరే ఉన్నారు. అయితే ఆ ఆఫర్‌ని నాగచైతన్య తిరస్కరించారు. తనకు మంచి క్యారెక్టర్లు, మంచి సినిమాలు ముఖ్యమని, డబ్బు ముఖ్యం కాదని తన నిర్ణయంతో చెప్పాడు నాగచైతన్య. చైతు నిర్ణయం సరైనదేనని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.