English | Telugu

డిసెంబర్ నెలకి నాగ చైతన్య భయపడుతున్నాడా!

అక్కినేని నాగ చైతన్య(naga chaitanya)ప్రస్తుతం తండేల్(thandel)షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.ఎంటైర్ చైతు కెరీర్ లోనే ఇప్పటికి వరకు రానటువంటి హై వోల్టేజ్ కథతో అత్యంత భారీ వ్యయంతో  తెరకెక్కుతున్న తండేల్ పై అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.తాజాగా తండేల్  రిలీజ్ డేట్ కి సంబంధించిన రూమర్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

డిసెంబర్ 20 న  తండేల్ ని థియేటర్స్ లోకి  తీసుకొస్తామని మేకర్స్ ఇటీవల అధికారకంగా ప్రకటించిన విషయం తెలిసిందే.నిజానికి సినిమా ప్రారంభోత్సవం అప్పుడే అక్టోబర్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ వేరే సినిమాలతో పోటీ ఉండటం మంచిది కాదనే ఉద్దేశ్యంతో  డిసెంబర్ 20 కి మారింది.ఇప్పుడు ఈ డేట్ కూడా మారిందని,  2025 జనవరి 13 న రిలీజ్ కాబోతుందనే  రూమర్స్ వినిపిస్తున్నాయి. 

మరి డిసెంబర్ 20 డేట్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan)గేమ్ ఛేంజర్, హాలీవుడ్ నుంచి ముఫాసా లాంటి అవైటెడ్ సినిమాలు వస్తుండంతో ఆ రూమర్ నిజమయ్యే అవకాశం కూడా లేకపోలేదు.ఇక తండేల్ ని చరణ్ మేనమేమ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుండగా  చైతు తో  సాయి పల్లవి(sai pallavi)జోడి కడుతుంది. కార్తికేయ 2 తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన చందు మొండేటి  దర్శకుడు.ఇప్పటికే విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో రికార్డు వ్యూయర్స్ తో ముందుకు దూసుకుపోతుంది.