English | Telugu
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ టైం.. దేవర రిలీజ్ కి ముందు ఊహించని షాక్!
Updated : Sep 19, 2024
ఈమధ్య పలు భారీ సినిమాలు మూడు గంటల నిడివితో థియేటర్లలో అడుగుపెడుతున్నాయి. సెప్టెంబర్ 27న విడుదల కానున్న 'దేవర' (Devara) కూడా మూడు గంటల నిడివితో వస్తుందని మొదటి నుంచి వినిపించిన మాట. సెన్సార్ పూర్తి కావడానికి ముందు.. ఈ మూవీ రన్ టైం 3 గంటల 10 నిమిషాలని కూడా ప్రచారం జరిగింది. దేవర అనేది రెండు భాగాలుగా వస్తున్న సినిమా. అలాంటిది మొదటి భాగమే మూడు గంటలకు పైగా నిడివి అంటే.. రిజల్ట్ ఏమవుతుందో అని జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో కొంత ఆందోళన వ్యక్తమైంది. ఆ తర్వాత 2 గంటల 58 నిమిషాలకు రన్ టైం లాక్ అయిందని తెలిసి కూల్ అయ్యారు. అయితే ఇప్పుడు ఇది కూడా ఫైనల్ రన్ టైం కాదని.. నిడివిని మరింత కుదించారని సమాచారం. (Jr NTR)
అదిరిపోయే యాక్షన్ ఎలిమెంట్స్ తో విజువల్ వండర్ లా రూపొందే.. 'దేవర' లాంటి భారీ సినిమాలకు 2 గంటల 58 నిమిషాల రన్ టైం అనేది సరైనదే. ప్రేక్షకులు నిడివి ఎక్కువని ఫీల్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. అయినప్పటికీ దేవర టీం.. నిడివి మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీలైనంతవరకు నిడివిని కుదించి.. ప్రేక్షకులను పూర్తి స్థాయిలో అలరించాలని చూస్తున్నారట. ఈ క్రమంలోనే మరో ఐదు నిమిషాలకు పైగా కోత విధించినట్లు వినికిడి. ఇందులో భాగంగా 'దావుది' సాంగ్ ని కూడా తొలగించినట్లు న్యూస్ వినిపిస్తోంది.
'దేవర' పార్ట్-1 కి దర్శకుడు కొరటాల శివ.. 2 గంటల 42 నిమిషాల క్రిస్పీ రన్ టైంని లాక్ చేశాడట. నో స్మోకింగ్ యాడ్స్, టైటిల్ కార్డ్, ఎడ్ క్రెడిట్స్ కలుపుకొని.. 2 గంటల 52 నిమిషాల వరకు ఉంటుందని తెలుస్తోంది. విడుదలకు ముందే నిడివిని మరింత కుదించి.. క్రిస్పీ రన్ టైంతో రావడం అనేది మంచి ఆలోచనే అయినప్పటికీ.. 'దావుది' సాంగ్ ని తొలగించడం అనేది ఎన్టీఆర్ అభిమానులకు నిరాశ కలిగించే అవకాశముంది.
ఇండియన్ స్టార్స్ లో బెస్ట్ డ్యాన్సర్స్ లో ఎన్టీఆర్ ఒకరు. సరైన మాస్ సాంగ్ పడితే ఎన్టీఆర్ ఏ రేంజ్ లో డ్యాన్స్ అదరగొడతాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే 'దావుది' రూపంలో 'దేవర'లో అదిరిపోయే డ్యాన్స్ నెంబర్ ఉందని తెలిసి.. ఫ్యాన్స్ ఎంతో సంబరపడ్డారు. అయితే ఇది సినిమాలో ఉండదని, కేవలం రోలింగ్ టైటిల్స్ లో వస్తుందన్న న్యూస్ తో.. కాస్త నిరాశ చెందారు. ఇక ఇప్పుడు మొత్తానికే ఆ సాంగ్ ని తొలగించారనే వార్త.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బిగ్ షాక్ అని చెప్పవచ్చు.
మరి 'దేవర' నిడివి, 'దావుది' సాంగ్ తొలగింపు గురించి వార్తలు ఎంతవరకు నిజమనేది.. మరో వారం రోజుల్లో తేలిపోనుంది.