English | Telugu

ఊహించని కాంబో.. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఎన్టీఆర్!

'పెళ్ళిచూపులు', 'ఈ నగరానికి ఏమైంది', 'కీడా కోలా' సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు తరుణ్ భాస్కర్. నటుడిగా, రచయితగా ఇతర ప్రాజెక్ట్ లు చేస్తున్న తరుణ్.. దర్శకుడిగా చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నాడు. పైగా ఇప్పటిదాకా చేసిన మూడు సినిమా కూడా కొత్త వాళ్ళతో చేసిన చిన్న, మీడియం రేంజ్ సినిమాలే. అయితే ఇప్పుడు తరుణ్ భాస్కర్ దర్శకుడిగా ఓ భారీ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ కోసం తరుణ్ ఓ అదిరిపోయే కథను సిద్ధం చేసినట్లు సమాచారం. నిజానికి ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి గతంలోనే ఈ యంగ్ డైరెక్టర్ ట్రై చేసినట్లు వార్తలొచ్చాయి. కానీ ఎందుకనో వీరి కాంబినేషన్ కి ముడి పడలేదు. అయితే ఇప్పుడు జూనియర్ తో సినిమా చేయడానికి తరుణ్ కాస్త గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు వినికిడి. ఇప్పటికే స్టోరీ లైన్ చెప్పగా తారక్ ఇంప్రెస్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పట్లో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం లేదు. 

ప్రస్తుతం యంగ్ టైగర్ ' దేవర ' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత వార్ 2, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్, దేవర 2 లైన్ లో ఉన్నాయి. ఇవి పూర్తి కావాలంటే కనీసం రెండేళ్ళు పడుతుంది. మరి ఆ తర్వాత తరుణ్ భాస్కర్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందేమో చూడాలి.