English | Telugu

పవన్ తో ఎన్టీఆర్-దుల్కర్ మల్టీస్టారర్!

కొంతకాలంగా మళ్ళీ మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ మొదలైంది. కథ నచ్చితే మల్టీస్టారర్స్ చేయడానికి బిగ్ స్టార్స్ కూడా ఏమాత్రం వెనకడుగు వేయడంలేదు. ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్'లో రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్.. త్వరలో హృతిక్ రోషన్ తో కలిసి 'వార్ 2'లో నటించనున్నాడు. అలాగే దుల్కర్ సల్మాన్ కూడా ఇతర స్టార్స్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడంలో ముందు ఉంటున్నాడు. అలాంటిది ఈ ఇద్దరు టాలెంటెడ్ యాక్టర్స్ కలిసి ఒక సినిమాలో నటిస్తే ఎలా ఉంటుంది?. త్వరలో ఇది సాధ్యమైనా ఆశ్చర్యంలేదు అనిపిస్తోంది.

'ప్రేమ ఇష్క్ కాదల్', 'సేనాపతి' వంటి చిత్రాలతో ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ పవన్ సాధినేని.. తాజాగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన ఫొటోలు అందరి దృష్టి ఆకర్షిస్తున్నాయి. "తారక్ అన్న మరియు నా హీరో దుల్కర్ తో ఒక అందమైన సాయంత్రం" అంటూ ఎన్టీఆర్, దుల్కర్ తో దిగిన ఫొటోలను షేర్ చేశాడు పవన్. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో "తారక్, దుల్కర్ కలిసి సినిమా చేయబోతున్నారా?.. చేస్తే బాగుంటుంది" అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

పవన్ దర్శకత్వంలో సినిమా చేయడానికి దుల్కర్ అంగీకరించినట్లు గతంలో వార్తలొచ్చాయి. తాజాగా "నా హీరో దుల్కర్" అంటూ పవన్ ఆ విషయాన్ని మరోసారి కన్ఫర్మ్ చేశాడు. అయితే దుల్కర్ తో పాటు తారక్ ఫొటోని షేర్ చేయడమే ఆసక్తికరంగా మారింది. అసలు ఈ ముగ్గురు ఎక్కడ కలిశారు? కలిసి సినిమా చేయడం కోసం ముగ్గురు మధ్య చర్చలు జరిగాయా? లేక ఏదైనా ప్రైవేట్ పార్టీలో అనుకోకుండా కలిసారా? అనేది సస్పెన్స్ లా మారింది. మరి ఈ సస్పెన్స్ కి తెరదించుతూ ఈ ఫొటోల వెనుకున్న కథ ఏంటో పవన్ త్వరలోనే రివీల్ చేస్తాడేమో చూడాలి.