English | Telugu

Navdeep Marriage: అమ్మ ప్రశ్నకు షాకైన నవదీప్‌... త్వరలోనే పెళ్ళి?

టాలీవుడ్‌ హీరోలు చాలా లేట్‌ వయసులో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే పెళ్లికాకుండా ఇంకా బ్యాచ్‌లర్‌ లైఫ్‌ గడుపుతున్న చాలా మంది హీరోలు.. ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధపడుతున్నారు. ఇటీవలే వరుణ్‌తేజ్‌ పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అతని బాటలోనే హీరో నవదీప్‌ కూడా పెళ్లికి రెడీ అంటూ సంకేతాలు పంపిస్తున్నాడు. 37 సంవత్సరాల నవదీప్‌ ముందు ఎప్పుడు పెళ్లి ప్రస్తావన తెచ్చినా ఏదో ఒక కారణం చెప్పి దానికి సమాధానం దాటేస్తుంటాడు. అయితే తాజాగా నవదీప్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన వీడియో చూస్తే.. తాను కూడా పెళ్లికి సిద్ధమేనని చెబుతున్నట్టు అనిపించింది. ‘పెళ్లిళ్ల మీద నా అభిప్రాయం తెలిసిన మా మదర్‌ ఇండియా పొద్దున్న నన్ను ఓ క్వశ్చన్‌ అడిగింది. నిజంగానే పెళ్లిళ్లు అంత బ్యాడ్‌ అయితే... పాపం పెళ్లిళ్లు వర్కవుట్‌ అవ్వక డివోర్స్‌ తీసుకున్నవారు మళ్లీ ఎందుకు పెళ్లి చేసుకుంటార్రా అని అడిగింది.... ఐ క్విట్‌’ అంటూ ఓ వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. Navadeep Twitter Video

అయితే నవదీప్‌ పెళ్లి మీద తన అభిప్రాయం మార్చుకున్నాడని ఈ వీడియో చూసిన తర్వాత ఎవరికైనా అర్థమవుతుంది. చివర్లో ‘ఐ క్విట్‌’ అనడాన్ని బట్టి.. పెళ్లి మీద ఇప్పటివరకు తనకు ఉన్న అభిప్రాయాన్ని మార్చుకుంటున్నానని చెప్తున్నట్టు ఉంది. దీన్ని బట్టి త్వరలోనే నవదీప్‌ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని అర్థమవుతోంది.

Navadeep Twitter Video