English | Telugu
చేతులు మారుతున్న పవన్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. కారణం అదేనా!
Updated : Aug 2, 2023
'గబ్బర్ సింగ్' వంటి సెన్సేషనల్ మూవీ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. క్రేజీ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తోంది. ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ జరుపుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి.. ఆ మధ్య ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు కూడా.
ఇదిలా ఉంటే, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయం ఆసన్నమవుతున్న తరుణంలో పవన్ కి ఉన్న ఇతర కమిట్ మెంట్స్ కారణంగా.. 'ఉస్తాద్ భగత్ సింగ్'ని తాత్కాలికంగా నిలిపివేయబోతున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చిన విషయం విదితమే. అంతేకాదు.. ఎన్నికల హడావిడి ముగిశాకే 'ఉస్తాద్' తిరిగి సెట్స్ పైకి వెళ్ళే అవకాశముందని వినిపించింది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. పవన్ కాల్షీట్స్ జాప్యం కారణంగా 'ఉస్తాద్ భగత్ సింగ్' చేతులు మారే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే.. ఈ ప్రాజెక్ట్ నుంచి మైత్రీ మూవీ మేకర్స్ బయటకు రావాలని చూస్తోందట. అంతేకాదు.. పవన్ తో తాజాగా 'బ్రో'ని నిర్మించి దగ్గరైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని టేకప్ చేస్తుందని టాక్. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశముంది.