English | Telugu
నయన స్థానంలో తమన్నా...?
Updated : Mar 20, 2014
తమిళంలో సూపర్ హిట్టయిన "బాస్ ఎంగిర బాస్కరన్" చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించబోతున్నారు. తెలుగులో "నేనే అంబానీ" పేరుతో డబ్బింగ్ చేసారు. ఈ చిత్రంలో ఆర్య, నయనతార జంటగా నటించారు. కానీ సీక్వెల్ లో మాత్రం హీరోయిన్ తమన్నాను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. ఎం.రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయం సాధించింది. ప్రస్తుతం తమన్నా హిందీలో రెండు చిత్రాలతో పాటు తెలుగు, తమిళ భాషల్లో నాలుగైదు చిత్రాలతో బిజీగా ఉంది. మరి తమన్నా ఈ సీక్వెల్ లో నటిస్తుందో లేదో చూడాలి.