English | Telugu

నాగార్జునతో కౌన్ బనేగా...?

 

అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా చేసిన "కౌన్ బనేగా కోర్‌పతి" కార్యక్రమం ఎంతటి పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమాన్ని తెలుగులో కూడా ప్రారంభించాలని "కౌన్ బనేగా.." యాజమాన్యం భావిస్తుంది. ఇటీవల "మాటీవీ"ని సోనీ సంస్థ సొంతం చేసుకోవడంతో తెలుగులో "కౌన్ బనేగా కోర్‌పతి"ని ప్రారంభించాలని భావిస్తోంది. ఇందుకు నాగార్జున వ్యాఖ్యాతగా చేస్తే బాగుంటుందని సోనీ యాజమాన్యం ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.