English | Telugu
పవన్ పార్టీలోకి హాట్ భాను ?
Updated : Mar 20, 2014
యాంకర్ ఉదయభాను అంటే చాలా మందికి తన మాటలు, హాట్ హాట్ అందచందాలు మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ ఆమెను కదిలిస్తే ఒక పక్కా మాములు మధ్యతరగతి అమ్మాయిలా కనిపిస్తుంది. బుల్లితెరపై తన మాటలతో అలరిస్తూ, వెండితెరపై తన అందచందాలతో కవ్విస్తున్న ఈ అమ్మడు త్వరలోనే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరబోతున్నట్లు తెలిసింది.
రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను చూస్తూ ఉండలేక వారిపై తిరగబడే ధైర్యం లేక ఒక పాట రూపంలో చెప్పింది. రాష్ట్రంలో అవినితీకి పాల్పడే చెత్త రాజకీయ నాయకులను నడిరోడ్డుమీద చెప్పుతో కొట్టినట్లుగా ఆ పాట పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. దాంతో 24 గంటల్లోనే ఆ పాటను తీసేసారు. పాటను మాత్రం తీసేసారు కానీ ఉదయభానులో ఉన్న పోరాటపు ఆవేశాన్ని ఎవరు శాంతిపజేయలేకపోయారు.
అయితే ఇటీవలే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి చాలా ఆవేశంగా ప్రసంగించారు. త్వరలోనే మీ ముందుకు వస్తాను అని పవన్ అన్నారు. అయితే ఇదిలా ఉంటే... ఉదయభానుకి కరీంనగర్, వరంగల్ ప్రాంతాల వైపు ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. కాబట్టి పవన్ లాంటి పార్టీలో చేరి ఈ చెత్త రాజకీయ నాయకులను ఎండగట్టాలని ఉదయభాను ఆలోచనలో ఉందట. మరి చివరకు ఉదయభాను ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.